మనమూ ఇక బికినీ బేబీలతో కలిసి ప్లైట్ లో ప్రయాణం చేయచ్చు

ఎక్కడో ఏదో దేశంలో..బికినీ వేసుకున్న ఎయిర్ హోస్టస్ లు ప్లైట్ లో ఉంటారు. చక్కగా వాళ్లను చూస్తూ అక్కడ వాళ్లు ప్రయాణం చేస్తూంటారు..మనకి ఆ అదృష్టం లేదు కదా అని బాధపడేవారికి ఓ శుభవార్త. ఇక నుంచి మన దేశంలో కూడా అలాంటి సర్వీస్ లు మొదలు కానున్నాయి. ప్రముఖ బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ వియత్నాంకు చెందిన  వియట్‌జెట్‌  ఢిల్లీనుంచి డైరెక్ట్‌ విమాన సర్వీసులను ప్రకటించింది.
 విమాన‌యాన రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన వివాదాస్ప‌ద వియ‌ట్ జెట్ త‌న త‌దుప‌రి వ్యాపార‌ గ‌మ్య‌స్థానంగా భార‌త్ ను ఎంచుకుంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న వియట్‌ జెట్‌ ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్‌ నగరానికి నడపనున్నట్లు ప్రకటించింది. ఇండియా-వియత్నాం దౌత్య సంబంధాల 45వ వార్షికోత్సవం సందర్భంగా  వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో ఈ విషయాన్ని తెలియచేసింది. ఆసియన్ ఏజ్ నివేదిక ప్రకారం బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన వియట్‌జెట్ ఎయిర్‌లైన్స్  జులై- ఆగస్టు లో భారత్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్‌ సేవలు అందించనున్నామని వెల్లడించింది.  ఈ రెండు నగరాలమధ్య వారానికి  నాలుగు సార్లు విమానాలను నిర్వహిస్తుంది.
వియ‌ట్ జెట్ కు బికినీ ఎయిర్ లైన్స్ గా పేరుంది. ఈ విమాన స‌ర్వీసుల్లో ఎయిర్ హోస్టెస్.. బికినీలు ధ‌రించి స‌ర్వీస్ చేస్తుంటారు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీపై ఎన్ని నిరసనలు వచ్చినా…ప‌లువురు త‌ప్పు ప‌ట్టినా, అక్కడ ప్రభుత్వం జరిమానా వేసినా….  వియోట్ మాత్రం ఏ మాత్రం మారలేదు.   పైలట్లు,  ఎయిర్‌హోస్టెస్‌లు సహా ఇతర  క్యాబిన్‌ క్రూ అంతా బికినీ ధరించి సేవలు అందించడమే ఈ బికినీ ఎయిర్‌లైన్స్‌ ప్రత్యేకత.  
2007లో మహిళా బిలియనీర్ గుయేన్ థీ ఫుంగ్‌ థావో  స్థాపించిన వైమానిక సంస్థ  వియత్నాం దేశంలోనే రెండవ అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా ప్రఖ్యాతి పొందింది.  ఈ  కంపెనీ 55 …ఏ320,  ఏ321 విమానాల విమానాలను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 385 విమానాలు నడుపుతోంది.